100 కి.మీ. మేర కరెంట్ లైన్లు డ్యామేజ్

100 కి.మీ. మేర కరెంట్ లైన్లు డ్యామేజ్
  • ఒక్క కామారెడ్డిలోనే 2 కోట్ల లాస్ 

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో కురుస్తు న్న భారీ వర్షాలు, వరదల కారణంగా తెలం గాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు తీవ్ర నష్టం వాటిల్లింది. 100 కిలోమీటర్ల మేర కరెంట్ లైన్లు దెబ్బతినడంతో పాటు స్తంభాలు, ట్రాన్స్‌‌‌‌ ఫార్మర్లు డ్యామేజ్ కావడంతో రూ.5.49 కోట్ల మేర నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 16 సర్కిళ్లు ఉండగా.. కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ సర్కిళ్లలోనే డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. 

ఈ మూడు జిల్లాల్లోనే కరెంట్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌‌‌‌ ఫార్మర్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే రూ.2.09 కోట్లు నష్టం జరిగినట్టు ఆఫీసర్లు అంచనా వేశారు. నిజామాబాద్‌‌‌‌లో రూ.1.76 కోట్లు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రూ.79 లక్షల వరకు నష్టం రాగా.. మిగిలిన 13 సర్కిళ్ల పరిధిలో రూ.85 లక్షల మేర నష్టం జరిగింది. పవర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 

కామారెడ్డిలో అధిక నష్టం.. 

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో కురిసిన వాన లకు కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 45.76 కి.మీ. మేర విద్యుత్‌‌‌‌ లైన్లు కొట్టుకుపోగా.. 763 పోల్స్‌‌‌‌, 147 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 25.26 కి.మీ. మేర విద్యుత్‌‌‌‌ లైన్లు, 421 స్తంభాలు, 142 ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు డ్యామేజ్ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 6.9 కి.మీ. మేర విద్యుత్ లైన్లు, 115 పోల్స్, 70 ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, వరంగల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తంగా 1,676 కరెంట్ స్తంభాలు, 100 కిలోమీటర్ల మేర విద్యుత్తు లైన్లు, 413 వరకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.