
మధిర, తల్లాడ, మణుగూరు/ వెలుగు: ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి గ్రామ సమీపంలోని వాగు పొంగి పొర్లింది. తల్లాడ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు ఇండ్లలోకి నీళ్లు చేరాయి. రామచంద్రపురం, వెంకన్నపేట గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మణుగూరు మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్, అరుంధతి నగర్, వినాయక నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. బాలాజీ నగర్ లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.