రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వాన..రైతన్నకు తీవ్ర నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వాన..రైతన్నకు తీవ్ర నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. సిద్ధిపేట, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాలో  ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చాలా చోట్ల పొలాల్లోకి వర్షం నీరు చేరడంతో ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి తోటలు ధ్వంసం అయ్యాయి. అకాల వర్షంతో కలిసిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమంటున్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.చేతి కందిన పంట నీళ్ల పాలయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొన్ని చోట్ల ఈదురుగాలులకు  విద్యుత్ స్తంభాలు, చెట్లు  విరిగిపోయాయి.  విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పిడుగు పడి ముత్యం మల్లేశం అనే వ్యక్తి మృతి చెందాడు.   తాటి కల్లు గీయడం కోసం వెళ్ళిన మల్లేశంకత్తి నురుతుండగా ఒకేసారి పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

జగిత్యాల జిల్లా బీమారం మండలం గోవిందారంలో పిడుగు పడి 20 గోర్లు మృతి చెందాయి. సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లడంతో రైతు లబోదిబోమంటుండు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.