బెంగళూరులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

బెంగళూరులో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరులోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. కోరమంగళ ప్రాంతంలో పలు చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. మరతహళ్లి–సిల్క్ బోర్డు జంక్షన్ దగ్గర రోడ్లన్నీ నీటనునిగాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద పోతేనే.. ట్రాఫిక్ క్లియర్ అవుతుందన్నారు వాహనదారులు.

మరతహళ్లి–సిల్క్ బోర్డు జంక్షన్ దగ్గర రోడ్డుపై నీరు నిలిచింది. నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానిక సెక్యూరిటీ గార్డులు రక్షించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. 3 ఫీట్ల మేర నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. వరద పోయేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.