అసోంలో భారీ వర్షాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

అసోంలో భారీ వర్షాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా కుండపోత వర్షాలతో అసోంని వరదలు ముంచెత్తాలయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బ్రహ్మపుత్ర నది గతంలో ఎన్నడూలేనంతగా ఉగ్రరూపం దాల్చడంతో దాదాపు 46 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. 

వరదల వల్ల జోనై సబ్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వేలాది ఇళ్లు నీట మునగగా... నీళ్లు తగ్గిన చోట్ల ఇళ్లల్లోకి బురద నీరు చేరిందిద. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, విపత్తుల నిర్వహణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
మరో వైపు భారీ వర్షాలు, వరదల వల్ల వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ధేమాజీ, లఖింపూర్, దిబ్రూగఢ్ జిల్లాలపై భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.