
బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాట్నాలో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. కొన్ని కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లోనూ భారీ వర్షం కురిసింది. రహదారులు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు అంతరాయం కల్గుతోంది. గంగా నదిలో వాటర్ లెవల్ పెరగడంతో .. తీరంలోని షాపుల్లోకి నీరు చేరింది.