హైదరాబాద్​లో వర్ష బీభత్సం.. బయటకి రావొద్దు

హైదరాబాద్​లో వర్ష బీభత్సం..  బయటకి రావొద్దు

హైదరాబాద్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, బోరబండ, వివేకానందనగర్, ఉప్పల్, నాగోల్, లింగంపల్లి, పటాన్​చెరు, పంజాగుట్ట, హైటెక్స్, గచ్చిబౌలి, కూకట్​పల్లి, సికింద్రాబాద్, బోయిన్​పల్లి, ఎల్​బీ నగర్, హయత్​నగర్, మియాపూర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

డీఆర్​ఎఫ్​ అలర్ట్.. 

వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. అలర్ట్​ అయిన డీఆర్​ఎఫ్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అత్యవసరమైతే తప్పా హైదరాబాద్​ప్రజలు బయటకి రావద్దని హెచ్చరిస్తున్నారు.  ఆఫీసుల నుంచి వర్షం తగ్గాకే బయటకి రావాలని పోలీసులు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు వస్తే 040 – 21111111, 9000113667 నంబర్స్ కి కాల్ చేయాలని సూచించారు. 

ఐఎండీ 25, 26 తేదీల్లో రెడ్​ అలర్ట్​ ప్రకటించింది.  భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

భారీగా ట్రాఫిక్​ జామ్​..

హైదరాబాద్​లో భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​​ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ చెక్​ పోస్ట్, కేబీఆర్​పార్క్​, జూబ్లీహిల్స్ రోడ్​నంబర్​ 45, 10, పెద్దమ్మ తల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్​ రోడ్ లలో ట్రాఫిక్​ గంటల తరబడి స్తంభించింది. 

దీంతో వాహనాలన్నీ మెల్లిగా కదులుతున్నాయి. ట్రాఫిక్​ పోలీసులు పలు చోట్ల వెహికిల్స్​ని దారి మళ్లిస్తున్నారు. రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. బీహెచ్​ఈఎల్​ చౌరస్తాలో సైతం ఫ్లైఓవర్​ నిర్మాణం కారణంగా భారీగా రద్దీ నెలకొంది.

ఖైరతాబాద్​లో కూడా..

ఖైరతాబాద్​ ఏరియాల్లో కూడా భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. విద్యుత్​సౌధ, కేసీపీ, సీఈవో, నిమ్స్​నుంచి పంజాగుట్ట వైపు ట్రాఫిక్​ రద్దీ చాలా ఉంది.  శ్రీ నగర్ కాలనీ, సుల్తాన్ ఉలూమ్ కళాశాల, చట్నీస్, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. 

రంగంలోకి దిగిన పోలీసులు పలు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నయ మార్గాలు చూడాలని ట్రాఫిక్​ పోలీసులు సూచిస్తున్నారు. 

భారీ ట్రాఫిక్​ జామ్​తో వాహనదారుల ఇక్కట్లు మామూలుగా లేవు. పలు చోట్ల అత్యవసర వాహనాలు సైతం చిక్కుకున్నాయి. ట్రాఫిక్​ జామ్​కి శాశ్వత పరిష్కారం దొరికేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.