
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడనున్నట్లు చెప్పింది.
సికింద్రాబాద్, ఓయూ, అబిడ్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, ఉప్పల్, కుతుబుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది అందరూ ఫీల్డ్ లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ నాలాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. వాహనాదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు.
రానున్న 48గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. 2024, జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.