ఆగస్టు 3 వరకు ఎల్లో అలర్ట్

ఆగస్టు 3 వరకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆగస్టు 3 వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది. ఆగస్టు 1న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది.