
తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుపతి నగరంలో హఠాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా సాయినగర్ లో ఓ భారీ చెట్టు నేల కూలి ఓ ఆటోపై పడింది. ఆటోధ్వంసం అయింది.
తిరుపతి ప్రజలు అకాల వర్షాలతో ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.