తిరుపతిలో వర్ష బీభత్సం... ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతాలు.. ఇళ్లలోకి వరద నీరు..

తిరుపతిలో వర్ష బీభత్సం... ఉప్పొంగి ప్రవహిస్తున్న జలపాతాలు.. ఇళ్లలోకి వరద నీరు..

తిరుపతిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం, కపిలతీర్థం దగ్గర జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కిందకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

వెస్ట్ చర్చ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా వర్షపు నీరు భారీ చేరుకున్న క్రమంలో రాకపోకలు నిలిపేశారు అధికారులు. NDRF, పోలీస్, ఫైర్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో మరో రెండు మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.
  
భారీ వర్షాల కారణంగా రేణిగుంట మండలం జి పాల్యం పరిధిలోని పద్మనగర్ జలదిబ్బందంలో చిక్కుకుంది.కురకాల్వ సర్వే నంబర్ 18/1లో  ప్రహరీ గోడ ఏర్పాటు చేయడంతో దిగువకు నీళ్లు వెళ్లకుండా పద్మానగర్లోకి ప్రవహించి ఇళ్లల్లోకి చేరుతున్నాయి. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ.