భారీగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ రాష్ట్రం నీటమునిగింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని వడోదర జలమయమైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే 12 మంది చనిపోయారు. భారీ వర్షాల కారణంగా నీరు ప్రవేశించడంతో వడోదర విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితిని సమీక్షించిన ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ…ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు ఇవాళ(గురువారం) సెలవు ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం.
వడోదర నగరంతోపాటు వల్సాద్, బహరుచ్, నవసారి, తాపి , బానసకాంత, పటాన్ జిల్లాల్లో శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. హరిద్వార్ మెయిల్, ప్రేరణ ఎక్స్ ప్రెస్, ముంబై -అహ్మదాబాద్ లోక్ శక్తి ఎక్స్ ప్రెస్, జంబూసర్-ప్రతాప్ నగర్ ప్యాసింజర్, వడోదర ప్యాసింజర్, ఆనంద్ బహరుచ్ రైళ్లు సహా పలు రైళ్లను రద్దు చేశారు.
