ఢిల్లీలో కుండపోత వర్షం

 ఢిల్లీలో కుండపోత వర్షం

దేశ రాజధాని ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. ఇవాళ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపారు. వరుసగా మూడ్రోజులు వర్ష సూచన ఉందని చెప్పారు. ఫీరోజ్ షా రోడ్, మహదేవ్ రోడ్, పండిత్ పంత్ మార్గ్ వర్షం దంచికొడుతోంది. రోడ్ల మీద మోకాలు లోతు నిలిచిపోయాయి. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. అత్యవసరమైతేనే ఇండ్లలో నుంచి బయటికి రావాలని అధికారులు ఢిల్లీవాసులకు సూచించారు.