హైదరాబాద్లో భారీ వర్షం

హైదరాబాద్లో భారీ వర్షం

రాష్ట్రంపై నైరుతి రుతు పవనాల ఎఫెక్ట్ కనిపిస్తోంది. వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటి దాకా ఎండలతో అల్లాడిపోయిన జనం కూల్ వెదర్ తో కాస్త సేద దీరారు. అక్కడక్కడా వర్షాలు పడుతుండటంతో.. ఉక్కపోత కూడా తగ్గిపోయింది. దీంతో జనం రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మెహిదీపట్నం, లింగంపల్లి,కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఘట్కేసర్ లో భారీ వర్షం కురిసింది. రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.