ఇయ్యాల‌‌‌‌ భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఇయ్యాల‌‌‌‌ భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌‌‌‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌‌‌‌లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని‌‌‌‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్​గా ఉండాలని సీఎస్ ​శాంతికుమారి ఆదేశించారు.