బంగాళాఖాతంలో వాయుగుండం..మూడురోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం..మూడురోజుల పాటు వర్షాలు

ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి పశ్చిమబెంగాల్.. ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ప్రకటించింది.

ఇది రానున్న 6 గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమబెంగాల్..ఉత్తర ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాగా ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. నగరంలో ఉదయం నుంచి ముసురు పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.