కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది
  • వాణిజ్య సిలిండర్ ధర రూ.183.50 తగ్గింపు
  • హైదరాబాద్ లో రూ.2242కు చేరిన కమర్షియల్ సిలిండర్

న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ సిలిండర్ల ధరను భారీగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.183.50 మేర తగ్గించినట్లు ప్రకటించాయి. 
మార్కెట్లో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరలకు కళ్లెం వేసే రీతిలో ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్లు.. రెస్టారెంట్లు, చిరుతిండ్ల తయారీ దారులు విరివిగా వాడే వాణిజ్య సిలిండర్ కొత్త ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయి. ప్రతినెల 1వ తేదీన గ్యాస్ ధరలను సమీక్షించి ప్రకటించే ఆయిల్ కంపెనీలు.. ఈసారి భారీగా ఉపశమనం కలిగించే రీతిలో తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి. 
మధ్య తరగతి ప్రజలు వినియోగించే 14.2 కిలోల వంటింటి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2021 ఉండగా.. అదే మన హైదరాబాదులో రూ.2,242, ముంబయిలో రూ.1981కి చేరాయి.