ఖాళీ అవుతోన్న హైదరాబాద్ .. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

ఖాళీ అవుతోన్న హైదరాబాద్ .. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

తెలంగాణలో అతి పెద్ద పండుగ  బతుకమ్మ, దసరా కావడంతో  హైదరాబాద్ నగరం సగానికి పైగా  ఖాళీ అవుతోంది.  లక్షలాది మంది ప్రజలు  సొంతూర్లకు  వెళుతుండటంతో బస్లాండ్లు, రైల్వే్స్టేషన్లు, ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. దీంతో  నగర శివారులు, చెక్ పోస్టులు, టోల్ ఫ్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.   పతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై  వాహనాలు నిలిచిపోయాయి.

బీబీనగర్ మండలం గూడురు  టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి.  దసర పండుగ సందర్భంగా ఊళ్లకు వెళుతుండడం, మరోవైపు ఎన్నికల  సందర్భంగా డీసీపీ రాజేష్ చంద్ర,ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఒక్కో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ముందుకు పంపించడంతో  టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

 జనమంతా ఊర్లకు వెళుతుండటంతో  హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది.  రోడ్లపై రద్దీ తగ్గీపోయింది. ట్రాఫిక్ తగ్గిపోయింది. ఇక ఊర్లకు వెళుతున్న వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు పోలీసులు.  ఇళ్లకు తాళం వేసేముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సూచించారు. దొంగలు  పడే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.