
ఎల్బీనగర్,వెలుగు: మేడ్చల్ జిల్లాలో సోమవారం మద్యం షాపుల లక్కీ డ్రాను నాగోల్‌లోని రాంరెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించగా ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆశావహులు భారీగా తరలిరాగా.. వారి వెహికల్స్‌ను ఫంక్షన్ హాల్ నుంచి సుమారు 500 మీటర్ల దూరం వరకు పార్కింగ్ చేశారు.
దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్డును క్లోజ్ చేసి బారికేడ్లు పెట్టి.. వెహికల్స్‌ను మళ్లించినా ఇబ్బందిపడ్డారు. మద్యం టెండర్ల డ్రా కోసం మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నించారు.