చంద్రబాబు ప్రమాణస్వీకారం: మంగళగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

చంద్రబాబు ప్రమాణస్వీకారం: మంగళగిరి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి తరఫున సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు చేసారు.ఇవాళ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు.చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.

ఈ నేపథ్యంలో మంగళగిరి సమీపంలోని హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యనేతలు తరలివస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లిలో ఏర్పాట్లు చేయగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా వైపుగా రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు 5కిలోమీటర్ల మేర నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది.