త్రిగుణ్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ హీరోలుగా హెబ్బా పటేల్ హీరోయిన్‌గా శ్రీనివాస్ మన్నె రూపొందించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రొడ్యూసర్‌గా నాకు కొంత గ్యాప్ వచ్చింది. నా గత సినిమా ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’ ఆశించినంతగా ఆదరణ పొందలేదు. అయితే మంచి కథల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అదే టైమ్‌లో దర్శకుడు శ్రీనివాస్ మన్నె ‘ఈషా’ కథ చెప్పారు.
ఇంటరెస్టింగ్‌గా అనిపించి ఈ ప్రాజెక్ట్ చేశాను. ప్రతి హారర్ థ్రిల్లర్ మూవీస్‌లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. ఇది చూశాక ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌కు విజువల్స్, సౌండింగ్ క్వాలిటీ బాగుండాలి. ఈ సినిమాలో ఆ రెండూ బాగా కుదిరాయి. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటే ఒకటి శ్రేయా ఘోషల్, మరొకటి శంకర్ మహదేవన్ పాడారు.
ఈ రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో నటించిన త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ సహా ప్రతి ఒక్కరూ బాగా నటించారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె టాలెంటెడ్ డైరెక్టర్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో రెండు మూడుసార్లు చూశాను. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది’ అని అన్నారు.
