ఘోరం తప్పింది : మంచు కొండల్లో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

 ఘోరం తప్పింది : మంచు కొండల్లో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

కేధార్నాథ్లో తృటిలో  ఘోర ప్రమాదం తప్పింది.  ల్యాండింగ్ టైమ్లో  హెలికాప్టర్ అదుపు తప్పింది. దీంతో భయంతో పరుగులు తీశారు భక్తులు. పైలట్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఘోర ప్రమాదం జరిగేది. మే 24వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండ్ అయింది.  హెలికాప్టర్ లో  ఆరుగురు యాత్రికులు, పైలట్‌తో సహా ఏడుగురు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. 

శుక్రవారం తెల్లవారుజామున సిర్సీ హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ బయలుదేరిందని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గహర్వార్ తెలిపారు. అయితే హెలికాప్టర్  లో  సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్‌ కేదార్‌నాథ్‌లోని హెలిప్యాడ్‌కు 100 మీటర్ల దూరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.   ఈ సంఘటన ఉదయం 7 గంటలకు జరిగింది.   

చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది, మే 12న బద్రీనాథ్ తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. జీవితంలో ఒక్కసారైన చార్ ధామ్ యాత్రను పూర్తి చేయాలని భక్తులు విశ్వసిస్తారు.