Uttarakhand : గంగోత్రి వెళ్తుండగా కూలిన హెలికాప్టర్.. స్పాట్లోనే ఐదుగురు మృతి

Uttarakhand : గంగోత్రి వెళ్తుండగా కూలిన హెలికాప్టర్.. స్పాట్లోనే ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో  ఐదుగురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. ప్రైవేట్ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి   గంగోత్రికి వెళుతుండగా  మే 7న ఉదయం  ఉత్తరకాశి జిల్లాలోని గంగానాని  సమీపంలో కుప్పకూలింది. 

ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో  ఏడుగురు ఉన్నారు. వారిలో ఐదుగురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ధృవీకరించారు.  ఘటనా స్థలానికి వచ్చిన  పోలీసులు, ఆర్మీ ఫోర్స్,  అంబులెన్స్‌లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. హెలికాప్టర్  ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేర్పించారు.