మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు.. చార్జీలు ఎంతంటే

మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు.. చార్జీలు ఎంతంటే

హైదరాబాద్: ఆసియా ఖండంలోనే ఆదివాసీల అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు  హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.  రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట ఎయిర్ పోర్టులో హెలి టూరిజంను జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభించింది. నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో ఇబ్బందిపడ్డ భక్తులు, ప్రజలు ఈసారి మేడారం జాతరకు కుటుంబ సమేతంగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు, పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. 
ఈ నేపథ్యంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు నడపనున్నారు. దీని కోసం చార్జీలను కూడా నిర్ణయించారు. కేవలం మేడారం జాతర ఏరియల్ వ్యూ చూడడానికి చార్జీ రూ.3700గా ఖరారు చేశారు. అలాగే  కరీంనగర్, హైదరాబాద్  నుండి హెలికాఫ్టర్ ప్రయాణ సర్వీసుతోపాటు వసతి సౌకర్యాల కోసం ఒక్కొక్కరికి రూ75వేలు, అలాగే మహబూబ్ నగర్ నుంచి రూ.1 లక్ష వసూలు చేస్తారు. డిమాండ్ ను బట్టి హెలికాఫ్టర్ సర్వీసులను ఈనెల 20 వ తేదీ వరకు నడపాలని నిర్ణయించారు. 
బేగంపేటలో జరిగిన హెలి టూరిజం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస రాజు, టూరిజం ఎండీ మనోహర్, రాష్ట్ర ఏవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి:

బీహెచ్ఎంఎస్  ప్రవేశాలకు నోటిఫికేషన్  జారీ

సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు!

జగన్‌తో సమావేశానికి నేను రానన్నా