
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమమాలిని(Hema Malini) సినిమాల్లోనే కాకుండా విభిన్న రంగాల్లో గుర్తింపు పొందారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో ఒక సినిమాకు ఎదురైనా విషయాలను పంచుకుంది.
"ఓ డైరెక్టర్ షూటింగ్ సందర్బంగా తనను చీర పిన్ను తీసెయ్యమన్నాడని తెలిపారు..ఆ డైరెక్టర్ అలా చెప్పగానే నా చీరకొంగు జారిపోతుంది కదా అన్నాను. అప్పుడు ఆయన అదే కదా నాకు కావాల్సింది అనడంతో షాక్ అయ్యాను'' అని తెలిపింది. కానీ ఆ డైరెక్టర్ ఎవ్వరో, ఆ సినిమా ఏంటో అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ వార్తా నెట్టింట్లో చర్చనీయాంశమైంది. హేమమాలిని ప్రస్తుతం BJP MP గా రాజకీయాల్లో రాణిస్తున్నారు.
హేమమాలిని గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ లో బాలకృష్ణకు తల్లిగా నటించింది. ఇక చివరగా తాను సిమ్లా మిర్చి మూవీ లో నటించారు. కేవలం బాలీవుడ్ లోనే 100 కు పైగా చిత్రాల్లో టాప్ హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందారు.
హేమమాలిని దర్శకురాలుగా, నిర్మాతగా, నాట్యకళాకారిణిగా, రాజకీయ నాయకురాలుగా..ఇలా ప్రతి ఒక్క రంగంలో తన సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు. భారత ప్రభుత్వం 2000 సం,లో పద్మ శ్రీ అవార్డు తో గుర్తించారు.