ల్యాప్‌‌టాప్‌‌ వాడుతున్నారా? ఈ గాడ్జెట్స్ మీ కోసమే

ల్యాప్‌‌టాప్‌‌ వాడుతున్నారా? ఈ గాడ్జెట్స్ మీ కోసమే

టెక్‌‌ యుగంలో ప్రతి రంగంలో కంప్యూటర్‌‌‌‌ వాడకం పెరిగింది. అందుకే దాదాపు అన్ని ప్రొఫెషన్లలో ఉన్నవాళ్లు  కంప్యూటర్‌‌‌‌ వాడుతున్నారు. అందులోనూ పీసీలకంటే ల్యాప్‌‌టాప్‌‌లే ఎక్కువగా వాడుతున్నారు. ఇంకొందరు వర్క్‌‌ పేరుతో ఇంట్లో కూర్చుని ల్యాప్‌‌టాప్‌‌లో పని చేస్తున్నారు. అలాంటివాళ్లకోసం.. కొన్ని ల్యాప్‌‌టాప్‌‌ గాడ్జెట్స్‌‌. ఇవి వాడడం వల్ల వర్క్‌‌ ఈజీగా చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.

మానిటర్ స్టాండ్‌‌ 
మార్కెట్‌‌లో చాలా రకాల మానిటర్‌‌‌‌ స్టాండ్స్‌‌ అందుబాటులో ఉన్నాయి.  వాటిలో లాన్‌‌క్యూ పీసీడీ డాక్‌‌ ప్రో పీసీ మానిటర్ స్టాండ్ చాలా కంఫర్ట్‌‌గా ఉంటుంది. ఇది ‘విండోస్‌‌ హెలో’తో పనిచేస్తుంది. దీనికి ఫింగర్‌‌ప్రింట్ మాడ్యూల్‌‌ కూడా ఉంటుంది. దీంతో సిస్టమ్‌‌ని సెకన్లలో అన్‌‌లాక్‌‌ చేయొచ్చు. దీనికి టైప్‌‌–సీ, యూఎస్‌‌బీ పోర్ట్‌‌లు కూడా ఉంటాయి. మానిటర్‌‌‌‌ నుంచి కనెక్ట్ చేసి ఈ స్టాండ్‌‌కు మౌస్‌‌, కీబోర్ట్‌‌ లాంటి డివైజ్‌‌లు కనెక్ట్‌‌ చేసుకోవచ్చు. దీనికి బ్రైట్‌‌ లైట్స్‌‌ కూడా ఉంటాయి. నైట్‌‌ టైంలో చాలా అట్రాక్టివ్‌‌గా కనిపిస్తాయి. ఇది ల్యాప్‌‌టాప్ హాట్‌‌స్పాట్‌‌గా కూడా పని చేస్తుంది. ఇందులో 2.4/5 GHz వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. ధర: 11,170 రూపాయలు.

కీబోర్డ్​ లైట్‌‌
ఇప్పుడు మార్కెట్‌‌లో ఉన్న చాలా రకాల ల్యాప్‌‌టాప్‌‌లకు బ్యాక్‌‌లిట్‌‌ కీ బోర్డ్‌‌లు రావడం లేదు. అలాంటి వాటితో రాత్రి పూట పనిచేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటివాళ్లు ఈ యూఎస్‌‌బీ లైట్‌‌ని ల్యాప్‌‌టాప్‌‌కు ఎటాచ్‌‌ చేస్తే సరిపోతుంది. ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి ఏ కోణంలోనైనా పెట్టుకోవచ్చు. సాఫ్ట్ టచ్ సెన్సర్‌‌తో పాటు లైట్ సెట్టింగ్‌‌లు ఉంటాయి. 
ధర: 350 నుంచి మొదలవుతుంది.

ల్యాప్‌‌టాప్‌‌ సూట్‌‌ కేస్‌‌
ఎక్కువగా ట్రావెల్‌‌ చేసేవాళ్లకు ఈ సూట్‌‌కేస్‌‌ బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్‌‌బుక్‌‌ లాంటి ఖరీదైన ల్యాప్‌‌టాప్‌‌లు వాడేవాళ్లు బ్యాక్‌‌ప్యాక్‌‌ల్లో కంటే ఇలాంటి సూట్‌‌కేసుల్లో క్యారీ చేస్తే సేఫ్‌‌గా ఉంటాయి. ట్వెల్‌‌ సౌత్‌‌ సూట్‌‌కేస్‌‌ వాటర్‌‌‌‌ ఫ్రూఫ్‌‌తో వస్తుంది. వర్షం కురిసినా ల్యాప్‌‌టాప్‌‌ తడవదు. దీన్ని మ్యాక్‌‌బుక్‌‌కి పౌచ్‌‌గా కూడా వాడుకోవచ్చు. 
ధర: దాదాపు 5,000 రూపాయలు

ఇంటెన్షన్ డిజైన్ ట్రైపాడ్ స్టాండింగ్ డెస్క్
చాలామంది ఇప్పుడు వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ చేస్తున్నారు. ఇంట్లో ఉంటారు కాబట్టి కాసేపు కూర్చుని, కాసేపు నిల్చుని, ఇంకాసేపు బెడ్‌‌పై తల వాల్చి పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాంటివాళ్ల కోసమే ఈ గాడ్జెట్‌‌. ఇది ట్రైపాడ్‌‌లా ఉంటుంది. బాల్కనీలో పెట్టుకుని, తగినంత హైట్‌‌ సెట్‌‌ చేసుకుని హాయిగా నిల్చొని పని చేసుకోవచ్చు. ఎత్తు తగ్గించుకుని కూర్చుని కూడా పని చేసుకోవచ్చు. 
ధర: దాదాపు 10,000 రూపాయలు

ల్యాప్‌‌టాప్‌‌ క్లీనర్‌‌‌‌
ల్యాప్‌‌టాప్‌‌ కీబోర్డ్‌‌లో పదే పదే దుమ్ము పేరుకుపోతుంది. క్లాత్‌‌తో తుడిచినా కీస్‌‌ మధ్య సరిగ్గా క్లీన్‌‌ అవ్వదు. పైగా స్క్రీన్‌‌ని తాకినప్పుడు ఫింగర్‌‌‌‌ ప్రింట్స్‌‌ పడతాయి. వాటిని నీళ్లు పెట్టి తుడవలేం. క్లాత్‌‌తో తుడిస్తే మలిగిపోవు. ఇలాంటి సమస్యలకు చెక్‌‌ పెట్టేందుకు ఓక్సో కంపెనీ స్వీప్‌‌, స్పైప్‌‌ పేరుతో ఒక బ్రష్‌‌ని మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇది సందుల్లోని దుమ్ము తొలగించడంతోపాటు  ఫింగర్‌‌‌‌ ప్రింట్లను కూడా చెరిపేస్తుంది. 
దీని ధర: 750 రూపాయలు