కరోనాతో పేషెంట్లకు కొత్త సమస్యలు..తాజా గైడ్‌ లైన్స్..

కరోనాతో పేషెంట్లకు కొత్త సమస్యలు..తాజా గైడ్‌ లైన్స్..
  • డిప్రెషన్‌, మతిమరుపుతో బాధపడుతున్న 30 శాతం మంది
  • టెన్షన్, ఒత్తిడికి లోనవుతున్నరు..అతిగా భయపడుతున్నరు
  • ట్రీట్‌ మెంట్‌ పై తాజాగైడ్‌ లైన్స్ జారీ చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు:    కరోనా మహమ్మారి అటు ఫిజికల్ హెల్త్ తో పాటు ఇటు మెంటల్ హెల్త్ పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ బారిన పడిన పేషెంట్లలో చాలా మంది ఆందోళన చెందుతున్నరు. అతిగా భయపడటం, మతిమరుపు వంటి సమస్యల బారిన పడుతున్నరు. కరోనా పేషెంట్లలో 30 శాతం మంది డిప్రెషన్, ఒత్తిడికి గురవుతున్నట్లు పలు రీసెర్చ్ లలో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గతంలో మెంటల్ ఇల్ నెస్ ఉన్నవాళ్లతో పాటు లేనివాళ్లు కూడా కరోనా బారిన పడ్డాక మానసిక సమస్యలు వస్తున్నాయని తెలిపింది. కరోనా భయం, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పరిస్థితులతో సాధారణ జనాలూ మానసిక ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపింది. ఈ కేటగిరీల పేషెంట్లతో మెంటల్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో ఓపీ సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. ఇలాంటి వారికి ట్రీట్‌‌‌‌మెంట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రకటిస్తూ గైడ్‌‌‌‌లైన్స్ జారీ చేసింది.

3 రకాలుగా విభజించాలె

మెంటల్ ఇల్‌‌‌‌నెస్‌‌‌‌తో బాధపడుతున్నవారిని 3 రకాలుగా విభజించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. కరోనాకు ముందే మానసిక సమస్యలు ఉండి, కరోనా తర్వాత సమస్య తీవ్రమైన వారిని ఒక కేటగిరీగా గుర్తించాలి. ముందు సమస్య లేకుండా, కరోనా కారణంగా సమస్యల బారిన పడుతున్నవారిని రెండో కేటగిరీగా గుర్తించాలి. వైరస్ సోకకున్నా.. కరోనా, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌, ఉద్యోగం పోవడం వంటి సమస్యలతో మెంటల్‌‌‌‌ ఇల్‌‌‌‌నెస్ బారిన పడిన వారిన మూడో కేటగిరీగా విభజించాలి. ఈ 3 విభాగాల వారికి వేర్వేరుగా చికిత్స అందించాలని సూచించింది. డాక్టర్లు, నర్సులపై కరోనా పేషెంట్ల దాడులకు కూడా పేషెంట్ల మానసిక స్థితే కారణమని గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇసొంటి రోగులను హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్ చేయొద్దని తెలిపింది. ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్ అందించాలని, వీడియో కన్సల్టింగ్‌‌‌‌లో కౌన్సిలింగ్ చేయాలని పేర్కొంది. కరోనా మెడిసిన్‌‌‌‌తో పాటు డిప్రెషన్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌పైనా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని వివరించింది.

భయంతో ఏడ్చిన

కరోనా పేషెంట్లను ట్రీట్‌ చేసే క్రమంలో నేను కూడా ఇన్‌ ఫెక్ట్ అయ్యా. బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవడంతో హాస్పిటల్‌ లో అడ్మిట్ అయ్యా.ఒకట్రెండు రోజులకే డిప్రెషన్ మొదలైంది.నాకే ఎందుకు ఇలా అయిందని బాధపడ్డా .కొన్నిసార్లు ఏడ్చిన. వార్డులో ఉన్నపరిస్థితులు, పక్కన ఎవరైనా చనిపోవడం
జరిగితే మన పరిస్థితీ ఇంతేనా? చనిపోతానా అని భయమేసేది. కరోనా వచ్చినప్పడు ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్‌ ఎవరూ తోడు ఉండకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడమే డిప్రెషన్‌ కు ముఖ్య కారణం.టైంకు తినమని అడిగే వాళ్లూ ఉండరు.ఇవే రోగుల్లో మానసిక సమస్యలకు కారణమవుతున్నయి .

– డాక్టర్ జహంగీర్‌‌‌‌‌‌‌‌, జనరల్ సర్జన్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌