
చిన్న చిన్న నాటకాల్లో నటించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)..రౌడీ బాయ్గా, స్టార్ భాయ్గా సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో అతిధి పాత్రల్లో నటించిన విజయ్..పెళ్లి చూపులు మూవీతో తెలుగు ఇండస్ట్రీని, అర్జున్ రెడ్డితో ఇండియా వైడ్గా ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నాడు.
అంతేకాదు..తన సోషల్ మీడియా ఖాతాలో కూడా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది.
ఫ్యామిలీ స్టార్ బడ్జెట్
మొదట్లో ఫ్యామిలీ స్టార్ మూవీని స్టార్ట్ చేసే ముందే పక్కా బడ్జెట్ తో ప్లాన్ చేసారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ అండ్ డైరెక్టర్ పరశురామ్ తమ ఇద్దరి రెమ్యునరేషన్ నుం ఎక్కువగా డిమాండ్ చేయకుండా వచ్చే లాభాలలో పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ప్రొడక్షన్ సమయంలో ఈ సినిమా షూటింగ్ కి ఆలస్యం జరగడంతో..ముందు అనుకున్న బడ్జెట్ ఊహించని విధంగా పెరుగుతూ వచ్చింది.అందువల్ల పెరిగే బి బడ్జెట్ కొంతవరకు నిర్మాత దిల్ రాజును నిరాశకు గురిచేసింది. అయితే,ఈ సినిమాకు దాదాపు రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని అంచనా.
విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్
ఫ్యామిలీ స్టార్ మూవీలో స్టార్ విజయ్ దేవరకొండ రూ.15 కోట్లకు పైగా తన రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, విజయ్ ఖుషి సినిమా కోసం రూ.12 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం.
Also Read: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెయు మోహనన్ సినిమాటోగ్రాఫర్‌గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.