Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!

Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!

మలయాళ ఇండస్ట్రీలో అసలు అంచనాలు లేకుండా రిలీజై ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి సంచలన విజయం సాధించిన సినిమా ప్రేమలు(Premalu). పర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను, మరీ ముఖ్యంగా కుర్రకారును తెగ ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమాకు మలయాళంలో వచ్చిన క్రేజ్ చూసి.. తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు మేకర్స్. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి తనయుడు రిలీజ్ చేయడం, సక్సెస్ మీట్ కి రాజమౌళి రావడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 

దానికి తోడు ప్రేమలు కథ మన హైదరాబాద్ చుట్టూ తిరగడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. దీంతో ఇక్కడ కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ప్రేమలు. మార్చి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఎన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. 

ఈ కారంగానే ప్రేమలు ఓటీటీ రిలీజ్ ఆలస్యం కానుందట. ముందుగా ఈ సినిమాను మార్చి 29 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, 29వ తేదీన మాత్రం స్ట్రీమింగ్ కు రాలేదు. దీంతో సినిమా లవర్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే.. ఈ ఆలస్యానికి కారణం లేకపోలేదు. ప్రేమలు సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా.. కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. ఆ కారణంగానే మరోవారం పాటు ప్రేమలు ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. త్వరలోనే కొత్త డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.