డ్రగ్స్ కేసు: దీపికా పదుకొనె‌‌‌ వాట్సాప్ చాట్‌‌లో ఏముంది?

డ్రగ్స్ కేసు: దీపికా పదుకొనె‌‌‌ వాట్సాప్ చాట్‌‌లో ఏముంది?

ముంబై: బాలీవుడ్‌‌లో డ్రగ్స్ వినియోగం విషయంపై విచారణ చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నలుగురు టాప్ హీరోయిన్లకు నోటీసులు జారీ చేసింది. దీపికా పదుకొనె‌‌‌, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌‌తోపాటు రకుల్ ప్రీత్ సింగ్‌‌కు ఎన్సీబీ సమన్లు ఇచ్చింది. ఈ విచారణలో రకుల్ ప్రీత్‌‌, శ్రద్ధా కపూర్‌‌కు మధ్య 2017లో జరిగిన వాట్సాప్ చాట్ కీలకంగా మారింది. అలాగే దీపికా పదుకొనె‌‌‌ ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌‌ల సంభాషణలు విచారణను వైవిధ్య కోణంలో కొనసాగించేందుకు ఉపయోగపడుతున్నాయని తెలిసింది. ఈ కన్వర్జేషన్స్‌‌లో హ్యాష్, మాల్ లాంటి పదాలు వాడటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వివరాల ప్రకారం దీపిక కోసం ఆమె మేనేజర్ కరిష్మా డ్రగ్స్‌‌ను జయ నుంచి సేకరించేదని తెలుస్తోంది. 2017, అక్టోబర్ 18న వాట్సాప్ గ్రూప్ చాట్‌‌లో మాట్లాడుకున్నట్లుగా చెబుతున్న ఈ సంభాషణ వివరాలు..

దీపికా పదుకొనె‌‌‌: ఓకే.. నీ దగ్గర సరుకు ఉందా?
కరిష్మా ప్రకాశ్: నా వద్ద ఉంది, కానీ అది ఇంట్లో ఉంది.. నేను బాంద్రాలో ఉన్నా.
కరిష్మా ప్రకాశ్: ఒకవేళ నీకు కావాలంటే అమిత్‌‌ను అడుగుతా.
దీపికా పదుకొనె‌‌‌: అవును కావాలి!!
దీపికా పదుకొనె‌‌‌: ప్లీజ్..
కరిష్మా: అమిత్ దగ్గర ఉంది.
దీపికా పదుకొనె: హ్యాష్ ఆహ్
దీపికా పదుకొనె: వీడ్ కాదనుకుంటా
కరిష్మా: అవును, హ్యాష్
కరిష్మా: నువ్వు కోకోకు ఎప్పుడు వస్తావ్?
దీపికా పదుకొనె: 11.30 నుంచి 12 గంటల మధ్య వస్తా.
దీపికా పదుకొనె: అక్కడ ఆమె ఎప్పటి వరకు ఉంటుంది?
కరిష్మా: నాకు తెలిసి 11.30 వరకు ఉంటుంది. 12 కల్లా తను వేరే ప్లేస్‌‌లో ఉండాలి.

శ్రద్ధా కపూర్, జయా సాహా మధ్య జరిగినట్లుగా చెబుతున్న మరో వాట్సాప్ చాట్:
జయ: హల్లో, ఇవ్వాళ జినాల్‌‌తో సీబీడీ ఆయిల్ పంపుతున్నా.
శ్రద్ధ: హే, థ్యాంక్యూ.
శ్రద్ధ: విను..
శ్రద్ధ: నేను ఎస్‌‌ఎల్‌‌బీని కలవాలని అనుకుంటున్నా