
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం సెట్స్‌కు అనుకోని అతిథిగా వచ్చి సర్‌ప్రైజ్ చేశారు అజిత్. తను హీరోగా నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి మూవీ షూటింగ్ సమీపంలోనే జరుగుతోందని తెలుసుకున్న అజిత్.. ‘విశ్వంభర’ సెట్స్‌కు వచ్చి ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. తన చేతులమీదుగా నిర్వహించిన అజిత్ ఫస్ట్ మూవీ ‘ప్రేమ పుస్తకం’ మ్యూజిక్ లాంచ్‌ను, అజిత్ భార్య షాలిని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో బాలనటిగా నటించిన విషయాన్ని మెగాస్టార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.