Viral Video: టాలీవుడ్ హీరో ర్యాష్ డ్రైవింగ్.. రాంగ్ రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసుతో రచ్చ

Viral Video: టాలీవుడ్ హీరో ర్యాష్ డ్రైవింగ్.. రాంగ్ రూట్లో వెళుతూ ట్రాఫిక్ పోలీసుతో రచ్చ

టాలీవుడ్ హీరో బెల్లకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. మంగళవారం (మే13) సాయంత్రం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో రాంగ్ రూట్లో కారు నడిపాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కారుతో డ్యాష్ ఇవ్వబోయాడు. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ క్షణికంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, బెల్లకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా దీనిని ప్రశ్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా మాట్లాడినట్టు వీడియోలో తెలుస్తోంది.

ఆ కానిస్టేబుల్.. హీరో బెల్లంకొండకి గట్టి వార్నింగ్ ఇస్తూ నిలదీశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హీరో బెల్లంకొండపై సీరియస్ అవుతున్నారు. హీరో అయినంత మాత్రాన పబ్లిక్ రోడ్డుపై ఎలా అయిన నడుపొచ్చా.. అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : రామ్ చరణ్కు బౌన్సర్‌గా మారిన కామన్‌వెల్త్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌

ఇకపోతే, బెల్లంకొండ క్రియేట్ చేసిన ఈ సంఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు కంప్లెయింట్ చేసినట్లు సమాచారం. మరి హీరో బెల్లంకొండపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

బెల్లంకొండ సినిమాల విషయానికి వస్తే.. 

టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. తనదైన యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం మూవీ మే30న రిలీజ్ కానుంది. అలాగే భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్లో టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది రిలీజ్ కు దగ్గరలో ఉంది. 

వీటితో పాటు ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మతో రాక్షసుడు 2 చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ‘కిష్కిందపురి’ చేస్తున్నాడు.