జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్లు తగ్గాయ్.. సెప్టెంబర్ 22 తర్వాత కొంటే.. హీరో బండ్లపై ధర ఎన్ని వేలు తగ్గుతుందంటే..

జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్లు తగ్గాయ్.. సెప్టెంబర్ 22 తర్వాత కొంటే.. హీరో బండ్లపై ధర ఎన్ని వేలు తగ్గుతుందంటే..

న్యూఢిల్లీ: జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రేట్లు తగ్గిన నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ తమ టూవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాలపై రూ.15,743 వరకు ధర తగ్గింపు ప్రకటించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.

స్పెండ్లర్ ప్లస్‌‌‌‌‌‌‌‌, గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రీమ్‌‌‌‌‌‌‌‌, జూమ్‌‌‌‌‌‌‌‌, డెస్టిని, ప్లెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌ వంటి మోడళ్లకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. “జీఎస్‌‌‌‌‌‌‌‌టీ 2.0 సంస్కరణలు వినియోగాన్ని పెంచి, జీడీపీ వృద్ధికి ఊతమిస్తాయి. ఇది భారత్‌‌‌‌‌‌‌‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో సాయపడుతుంది” అని హీరో మోటోకార్ప్ సీఈఓ విక్రమ్ కస్బేకర్ అన్నారు.

భారతదేశంలో సగం కన్నా ఎక్కువ కుటుంబాలు ద్విచక్ర వాహనాలను రోజువారీ అవసరాలకు ఉపయోగిస్తుండటంతో, ఈ ధర తగ్గింపు మాస్ మొబిలిటీకి కీలకంగా మారనుంది. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు రేట్లు తగ్గడంతో బండ్ల సేల్స్ పెరుగుతాయని  కంపెనీ పేర్కొంది.