హీరో నుంచి ఎలక్టిక్ స్కూటర్ 'ఎడ్డీ'

హీరో నుంచి ఎలక్టిక్ స్కూటర్ 'ఎడ్డీ'

దేశీయ టూ వీలర్ వెహికిల్ తయారీ దిగ్గజం హీరో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్ ఫోలియోలో కొత్త మోడల్ ను చేర్చింది. తాజా మోడల్ కు ఎడ్డీ అని పేరు పెట్టింది. హీరో సంస్థ ఇప్పటికే ఫ్లాష్, ఎట్రియా, ఆప్టిమా, ఎన్ వైఎక్స్, ఫోటాన్ మోడళ్లను అమ్ముతోంది. ఈ లిస్టులో ఎడ్డీ కూడా చేరింది. హీరో ఎడ్డీ త్వరలోనే భారత రోడ్లపై పరుగులు తీయనుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.72 వేలు. యెల్లో, లైట్ బ్లూ కలర్స్ లో ఇది అందుబాటులో ఉంది.  అయితే.. హీరో ఎడ్డీకి లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. ఇది లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని, గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుందని  హీరో ఎలక్ట్రిక్ సంస్థ చెప్పింది. తక్కువ దూరం  ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఎడ్డీని తయారు చేసినట్లు  తెలిపింది. 

టెక్ ఫీచర్లకు ఇందులో కొదవలేదు. ఫైండ్ మై బైక్, ఈ-లాక్ వంటి సాంకేతిక సదుపాయాలున్నాయి. విశాలమైన బూట్ స్పేస్, ఫాలో మీ  లైట్స్ దీని స్పెషాల్టీ. అంతేకాదు, హీరో ఎడ్డీలో రివర్స్ మోడ్ కూడా ఉంది. హీరో మోటార్స్ విద్యుత్ వాహనాల విభాగమే హీరో ఎలక్ట్రిక్. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు దేశవ్యాప్తంగా 750 సేల్స్, సర్వీస్ అవుట్ లెట్లు ఉన్నాయి. విస్తృతస్థాయిలో చార్జింగ్ పాయింట్లు, తక్షణ సహాయం అందించే రోడ్ సైడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిక్ లు హీరో ఎలక్ట్రిక్ అందుబాటులో ఉంచుతోంది. దేశవ్యాప్తంగా హీరో ఎలక్ట్రిక్ వాహనాలు 4.5 లక్షల వరకు ఉంటాయి.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్ నుంచి ఇండియాకు మరో 434 మంది