భాగమతి డైరెక్టర్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

భాగమతి డైరెక్టర్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్

పిల్లా జమిందార్ ఫేమ్ డైరెక్టర్ జి ఆశోక్ మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జీనియస్ మూవీ ఫేమ్ హవీష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జూన్ 25 హవీష్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ నుండి హవీష్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. 

ఇవి కూడా చదవండి:  కేసీఆర్ షో చేస్తూ పాలిస్తున్నాడు.. బీఆర్ఎస్ హయాంలో అన్నీ రంగాల్లో ప్రభుత్వం విఫలం

ఈ సినిమాకు చూ.. మంత్ర కాళీ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.  థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా.. 2024 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.