
రూ.73,550 కే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రో
హీరో మోటోకార్ప్ హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్రోను ఇండియాలో రూ.73,550 కే (ఎక్స్‌షోరూమ్ ధర) లాంచ్ చేసింది. ఈ బండిలో 97.2 సీసీ ఐ3ఎస్ టెక్నాలజీ ఇంజన్‌ను అమర్చారు. తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ టైర్లతో అత్యుత్తమ మైలేజీనిస్తుందని కంపెనీ చెబుతోంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ స్పీడోమీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి.
హోండా షైన్‌లో ప్రీమియం వెర్షన్
షైన్ 100 డీఎక్స్‌ను హోండా మోటార్‌సైకిల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇది షైన్ 100 మోడల్‌లో ప్రీమియం వెర్షన్. ఈ బైక్‌లో పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. బోల్డ్ గ్రాఫిక్స్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్‌తో స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. 98.98సీసీ ఇంజన్ 7.28 బీహెచ్‌పీ పవర్‌ను, 8.04 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో, నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.72 వేల నుంచి ప్రారంభమవుతోంది.
125 సీసీ స్పోర్ట్స్ సెగ్మెంట్‌లోకి హోండా
హోండా 125సీసీ సెగ్మెంట్‌లో స్పోర్ట్ బైక్‌ను తీసుకొచ్చింది. సీబీ125 హార్నెట్‌తో టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌లతో పోటిపడనుంది. ఈ బైక్‌లో షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ సీట్, 4.2-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్ యాప్, యూఎస్‌బీ ఛార్జింగ్, సింగిల్-ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.20 లక్షలు. బుకింగ్స్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతాయి.