
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda) హీరోగా లేటెస్ట్గా రిలీజైన మూవీ బెదురులంక 2012(Bedurulanka 2012). కొత్త దర్శకుడు క్లాక్స్(Clax) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో డీజీ టిల్లు(DJ Tillu) బ్యూటీ నేహా శెట్టి(Neha shetty) హీరోయిన్గా నటించగా కలెక్షన్స్తో పర్వాలేదనిపిస్తుంది. దీంతో హీరో కార్తికేయ మరోసారి హిట్ ట్రాక్ లోకి రావడం కన్ఫర్మ్ అయినట్టే అని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే హీరో కార్తీకేయకు కొన్నాళ్లుగా సరైన హిట్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. బెదురులంక 2012 మూవీని మేకర్స్ కరెక్ట్ టైంలో రిలీజ్ చేయగా..ఈ సక్సెస్ని చేరుకోవడం ఈజీ అయ్యిందని తెలుస్తుంది. బెదురులంక మూవీకి పోటీగా వచ్చిన.. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో కార్తికేయకి ప్లస్ అయ్యింది. దీంతో వీకెండ్ కలెక్షన్స్తో బెదురులంక మూవీ దూసుకెళ్తుంది.
హీరో కార్తీకేయకు ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత సరైన హిట్ పడకపోవడం వల్ల తన సినిమా కెరీర్ అయిపోయినదనే వార్తలు వచ్చాయి. హిప్పీ, గుణ 369, 90ML, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క వంటి మూవీస్తో వచ్చిన..ఆడియన్స్ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక విలన్గా కార్తీకేయ మరో యాంగిల్ను చూపిస్తూ నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై మూవీస్లో ఆకట్టుకున్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
దీంతో బెదురులంక మూవీపైనే భారీ ఆశలు పెట్టుకున్న కార్తీకేయ మరోసారి హిట్ దక్కించుకున్నారు. ఇక ఇదే హిట్ ట్రాక్ను కంటిన్యూ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.
బెదురులంక మూవీ 2012 యుగాంతం నేపథ్యంలో రాగా..విలేజ్ లో సాగే కామెడీ, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో డైరెక్టర్ చక్కగా చూపించారు. ఇందులో హీరో మనసుకు నచ్చినట్టు జీవించే క్యారెక్టర్లో నటించి మెప్పించారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని కీ రోల్స్లో నటించారు.