అన్న చావుతో చాలా మారిపోయా! : సినీ హీరో కిరణ్ అబ్బవరం

అన్న చావుతో చాలా మారిపోయా! : సినీ హీరో కిరణ్ అబ్బవరం
  •     ఆ యాక్సిడెంట్​నా జీవితాన్ని మార్చేసింది
  •     సినీ హీరో కిరణ్ ​అబ్బవరం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​లో ట్రాఫిక్ సమ్మిట్ రెండో రోజూ కొనసాగింది. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​గా సినీ హీరో కిరణ్ అబ్బవరం హాజరై మాట్లాడారు. తన అన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని, అప్పటివరకు ఎలాంటి సీరియస్నెస్ లేని తాను.. చాలా మారిపోయానని చెప్పారు. అప్పట్లో ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించేవాడిని కాదని,  ఆ ఒక్క ఇన్సిడెంట్ తో తన జీవితానని మార్చేసిందన్నారు. 

కుటుంబానికి తన అవసరం ఉందని ఆలోచిస్తూ కారు స్టీరింగ్ పట్టుకుంటానన్నారు. యువకులు ఎక్కువగా రూల్స్ పాటించరని, కానీ  సరదా కోసం,  ఎంజాయ్మెంట్ కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకోవద్దని సూచించారు. సీపీ సీవీ ఆనంద్​మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఆధునిక సిగ్నల్ వ్యవస్థలు, వీఐపీ కాన్వాయ్ నిర్వహణ, డ్రోన్, హై-రైజ్ కెమెరా మానిటరింగ్, గూగుల్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఏఐ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులపై నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు.