Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా.! కారణం ఏంటంటే..?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా.! కారణం ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి ఈ రోజు (జూలై 9న) 11:01 amకి రిలీజ్ అవ్వాల్సిన ‘క..క‘#KA టైటిల్ పోస్టర్ వాయిదా పడినట్లు సమాచారం. అయితే,'KA'టైటిల్ పోస్టర్ కొన్ని కారణాల వల్ల రేపు జూలై 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్ర ట్రైలర్ ను జులై 13న లేదా 14న ఏదో ఒక తేదీన మేకర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.అయితే,రేపు జరగబోయే టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే,నేడు టైటిల్ ప్రకటన వాయిదా పడటానికి గల కారణం ఏంటంటే..సినీ ఇండస్ట్రీలో ముహూర్తాలకు,మంచి రోజులను తప్పకుండా పాటిస్తారు.ఇంకొందరు అయితే మంచి రోజు లేనిదే సెట్లో కూడా అడుగు పెట్టరు.ఈ నేపథ్యంలో ఈ రోజు ఆషాడం మంచి ముహూర్తం లేని కారణంగా టైటిల్ ప్రకటనను మేకర్స్ వాయిదా వేసింనట్లు సమాచారం.

శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్,కిరణ్ అబ్బవరం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సుజీత్,సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాకు మేకర్స్ రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారట.నిజానికి కిరణ్ అబ్బవరం లాంటి హీరోపై రూ.20 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఒకరకంగా మేకర్స్ రిస్క్ చేస్తున్నట్టే.కానీ,వారు ఎంచుకున్న కథపై నమ్మకంతోనే కిరణ్ పై అంత పెట్టడానికి సిద్దమయ్యారట. 

ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట.త్వరలోనే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.ఇక ఈ న్యూస్ తెలిసి కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.గ్యాప్ ఇచ్చినా పరవాలేదు..పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు కిరణ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరి కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.కాగా ఈ చిత్రాన్ని కిరణ్ కాబోయే భార్య రహస్య గోరక్‌ దగ్గరనుండి పర్యవేక్షిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఆయన నుండి చివరగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్.జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దాంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు కిరణ్.ఆ సమయాన్ని తన తరువాతి సినిమాను పక్కాగా ప్లాన్ చేసుకోవడనికి ఉపయోగించుకున్నాడు.మరి రాబోయే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోనున్నాడో చూడాలి.