కరోనాపై భయపడకండి.. ప్రజలకు ధైర్యం చెప్పిన మహేష్ బాబు

కరోనాపై భయపడకండి.. ప్రజలకు ధైర్యం చెప్పిన మహేష్ బాబు

ప్రపంచ దేశాలను వనికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి రావడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అయితే తెలంగాణలో కూడా ఒక కరోనా పాజిటీవ్ కేసు నమోదైంది. కరోనాను నివారించడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి.  అయితే ప్రజలు భయపడొద్దంటూ ట్వీట్ చేశారు టాలీవుడ్ హీరో మహేష్ బాబు. అయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ధైర్యం చెప్పారు.  తరచూ చేతులు కడుక్కొవాలని సూచించారు. బయటకు వెళ్లినపుడు ఫేస్ మాస్క్ ను వేసుకోవాలని, వాడిన టిష్యూలను పాడేయాలని అన్నారు. ఒక వేల దగ్గు, జ్వరం, విపరీతమైన చాతి నొప్పి వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కోరారు.