సోదరా టైటిల్ సాంగ్‌ రిలీజ్

సోదరా టైటిల్ సాంగ్‌ రిలీజ్

సంపూర్ణేష్ బాబు, సంజోష్ లీడ్ రోల్స్‌‌లో మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో  చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘సోదరా’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌తో ఆకట్టుకుంది టీమ్. తాజాగా ‘అన్నంటే దోస్తే సోదరా’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌‌ను హీరో మంచు మనోజ్ రిలీజ్ చేసి సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు.  నా సొంత సోదరుడి లాంటి మనోజ్ ఈ సాంగ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది అన్నాడు సంపూర్ణేష్​ బాబు. 

ఈ పాట అన్నదమ్ములకే కాక అందరికీ నచ్చుతుంది అన్నాడు సంజోష్.  దర్శకుడు మన్‌‌ మోహన్ మాట్లాడుతూ ‘సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన పాటకు సుద్దాల అశోక్ తేజ గారు రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి’ అని చెప్పారు. ఈ పాటతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని నిర్మాత చంద్ర అన్నారు. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.