భార్య కోసం పూలు దొంగతనం చేసిన విష్ణు.. వైరలవుతున్న వీడియో

భార్య కోసం పూలు దొంగతనం చేసిన విష్ణు.. వైరలవుతున్న వీడియో

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa) సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు రూ.100 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూజీలాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మహాశివుడిగా దర్శనమివ్వనున్నాడు. ఆయనకు జోడీగా నయనతార పార్వతిగా నటించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే షూటింగ్ గ్యాప్ లో తన భార్యతో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాడట విష్ణు. ఆ దారిలో విరానికాకు ఎంతో ఇష్టమైన హైడ్రేంజ (Hydrangeas) పూలు కనిపించాయట. అవి కావాలని భర్తను అడగగానే వెంటనే వెళ్లి కోసుకొచ్చారట విష్ణు. ఈ విషయం గురించి విరానికా తన సోషల్ మీడియాలో చెప్తూ.. న్యూజిలాండ్ లో లాంగ్ డ్రైవ్ కు వెళ్తుంటే రోడ్డు పక్కన నాకు ఇష్టమైన హైడ్రేంజ (Hydrangeas) పూలు కనిపించాయి. నాకోసం విష్ణు వాటిని కోసుకు వచ్చారు.. అంటూ చెప్పుకొచ్చారు దానికి బదులుగా విష్ణు.. నా ప్రేమ కోసం తనకు ఇష్టమైన పూలు కోసుకురావడానికి వెళ్తున్నాను.. అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viranica Manchu (@viranica)

అయితే ఇందులో దొంగతనం ఏముంది అనుకుంటున్నారా.. ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ కారు ఆపి పువ్వులు కోయడం అనేది నేరం. ఒకవేళ అక్కడి పోలీసులు చూస్తే తగిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అది చిన్న దొంగతనం కిందకే వస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.