ప్రముఖ బైక్ తయారీ కంపెనీ హీరో.. కొత్త బైక్ Hero Mavrick 440 ని ఇటవీల భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.దీని ధర రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల మధ్య ఉంటుంది. Hero Mavrck 440 ఎయిర్ కూల్డ్ 440 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా 6000 rpm వద్ద hp, 4000 rpm వద్ద 36Nm శక్తిని అందిస్తుంది. ఈ టార్క్ లో 90 శాతం 2000 rpm నుంచి లభిస్తుందని కంపెనీ తెలిపింది. మావ్రిక్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
ఈ బైక్ ప్రధాన ఫ్రేమ్ హార్లే X440 లాగానే ఉంటుంది. అయితే మావ్రిక్ ముందు భాగంలో సరళమైన 43 mm టెలిస్కోపిక్ ఫోర్క్ ను ఉపయోగిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 175mm మావ్రిక్ 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది.
ఈ బైక్ బైస్, మిడ్, టాప్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ తెలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. స్పోక్డ్ వీల్స్ తో వస్తుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ తో రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. టాప్ స్పెక్ వేరియంట్ లో బ్లూటూత్ కనెక్టివిటీ , డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో అందుబాటులో ఉంది.
హీరో మావ్రిక్ దాని ధరలో పోల్చితే రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350, హెండో సిబీ 350, కొత్త వచ్చిన జావా 350 బైక్ లకు గట్టి పోటీనిస్తుంది. Hero కంపెనీలో అత్యంత ఖరీదైన బైక్ ఇదే. అయినప్పటికీ Mavrick 440 ఇప్పటికీ Harley Davidson X440 కంటే చాలా తక్కువ ధరలో లభిస్తోంది.
బుకింగ్ .. రూ. 5000 టోకెన్ మొత్తానికి బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీ ఏప్రిల్ 15 ను ప్రారంభం అవుతాయి. మార్చి 15 లోపు బుకింగ్ చేసుకున్న కస్టమర్లు Hero వెబ్ సైట్ ప్రకారం రూ. 1000 విలువైన బహుమతుల కిట్ ను పొందుతారు.
