
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya) యాంకర్ సుమ(Anchor Suma)కు షాకిచ్చారు. తమ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ సుమ అంటూ స్టేజి పైనే ప్రకటించారు. అది విన్న యాంకర్ సుమ ఒక్కసారిగా షాకైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali). పవన్ బాసంశెట్టి(Pawan Basamsetty) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా రీసెంట్ గా రంగబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. చాలా గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఈవెంట్ కు ఎప్పటిలాగే టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ హోస్ట్ గా చేసింది. స్టేజిపై తనదైన పంచులతో ఆడియన్స్ ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది. ఈవెంట్ జరుగుతున్న మధ్యలో హీరో నాగశౌర్య మైక్ తీసుకుని రంగబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యాంకర్, గెస్ట్ సుమనే చీఫ్ గెస్ట్ అని అనౌన్స్ చేశారు. ఆమాటలు విన్న హోస్ట్ సుమ ఒక్కసారిగా షాకైంది.
ఇంకా నాగ శౌర్య మాట్లాడుతూ..‘‘ ఎన్నో సినిమాల మంచి కోరి, ప్రతి మూవీ ఈవెంట్‌కు యాంకర్‌గా చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు సుమ. అందరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకునే సుమ గారి కంటే మంచి చీఫ్ గెస్ట్ ఇంకెవ్వరూ ఉంటారు. అందుకే.. మా ఈ ఈవెంట్ కు ఆవిడే మా చీఫ్ గెస్ట్ అని ప్రకటించాడు. నేను మాట్లాడిన తర్వాత కచ్చితంగా సుమ గారు మాట్లాడాలి.. లేదంటే ఇక్కడున్న ఎవరూ వేదిక మీద నుంచి కదలమని చెప్పుకొచ్చారు. దీంతో మైక్ తీసుకున్న సుమ.. "తాను చీఫ్ గెస్ట్‌గా అన్న సంగతి తనకే తెలీదని సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.