
సినిమాలతో పాటు వెబ్ సిరీసులకు కూడా ఆదరణ పెరగడంతో ఫేమస్ యాక్టర్స్‌తో పాటు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు. నాని కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాడు. ఈ విషయాన్ని తనే రీసెంట్‌గా చెప్పాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్ననాని.. ఆల్రెడీ అ, హిట్ సినిమాలతో తన టేస్ట్ ఏంటో చూపించాడు. ఇప్పుడు తన బ్యా
నర్‌పై వెబ్‌సిరీసులు తీయడానికిప్లాన్ చేస్తున్నాడు. అయితే కేవలం నిర్మిస్తాడా లేక వాటిలో నటిస్తాడా అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
నిజానికి నాని ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అతడు సుధీర్ బాబుతో కలిసి నటించిన ‘వి’ సెప్టెం బర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ‘టక్ జగదీష్’ అక్టోబర్‌లో సెట్స్‌కి వెళ్లనుంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్‌దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ కమిటయ్యాడు. మరో ఇద్దరు దర్శకులకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పుడు వెబ్ సిరీసుల్లో నటించడం కాస్త కష్టమే కాబట్టికేవలం ప్రొడ్యూస్ చేస్తాడు తప్పయాక్ట్ చేయడనేది ఇండస్ట్రీటాక్.