ఫ్రంట్ లైన్ వారియర్స్‌‌ కోసం స్పెషల్ సాంగ్

V6 Velugu Posted on Jun 17, 2021

కరోనా కట్టడి కోసం పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌‌ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అందుకే మాటల్లో కాదు, పాటలో వారి గొప్పదనాన్ని చెబుతాను అంటున్నాడు నాని. మెడికల్ స్టాఫ్‌‌ కోసం ఓ సర్‌‌‌‌ప్రైజ్‌‌ను రెడీ చేస్తున్నానని రీసెంట్‌‌గా చెప్పిన నాని.. అదేమిటో ఇప్పుడు రివీల్ చేశాడు. వారి కోసం ఓ స్పెషల్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. ‘దారే లేదా’ అంటూ సాగే ఈ పాటను తెలుగు, తమిళ వెర్షన్స్‌‌లో రిలీజ్ చేయబోతున్నాడు. ఇందులో సత్యదేవ్, రూప కొడువయూర్ నటిస్తున్నారు. ఇటీవల నాని అనౌన్స్ చేసిన ‘మీట్ క్యూట్ ’సినిమాకి సంగీతం అందిస్తున్న బుల్గానిన్ ఈ పాటని కంపోజ్ చేశాడు. తెలుగు లిరిక్స్ కృష్ణకాంత్, తమిళ లిరిక్స్‌‌ మదన్ కార్కి రాశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై నాని ప్రొడ్యూస్‌‌ చేస్తున్న ఈ సాంగ్‌‌ని లహరి మ్యూజిక్ ద్వారా త్వరలోనే విడుదల చేయనున్నారు. మరోవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. థియేటర్స్‌‌ ఓపెన్ చేయగానే రిలీజవడానికి ‘టక్ జగదీష్’ రెడీగా ఉంది. పరిస్థితులు చక్కబడగానే సెట్స్‌‌కి వెళ్లడానికి శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు. నిర్మాతగానూ రెండు సినిమాలు తీస్తున్నాడు. వీటన్నింటి గురించి మాత్రమే చూసుకోకుండా రియల్ హీరోస్‌‌ కోసం ఇదంతా ప్లాన్‌‌ చేయడం నిజంగా గ్రేట్.

Tagged corona virus, frontline warriors, natural star Nani, HERO NANI, special song for frontline warriors, daare leda song

Latest Videos

Subscribe Now

More News