అభిమానులకు నిఖిల్ సిద్దార్ధ క్షమాపణలు.. ఎందుకంటే?

అభిమానులకు నిఖిల్ సిద్దార్ధ  క్షమాపణలు.. ఎందుకంటే?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ(Nikhil Siddhartha) రీసెంట్ మూవీ 'SPY'.  భారీ అంచనాలతో రిలీజ్ అయినా బాక్సాపీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ తో నిఖిల్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాస్ వసూళ్లతో నిలవగా..రెండవ రోజు నుంచి మాత్రం అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. తాజాగా ఇదే విషయంపై నిఖిల్ స్పందిస్తూ  ఫ్యాన్స్ కు ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు..

"నా కెరీర్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఓపెనింగ్స్ను అందించినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరు ఇంత నమ్మకం ఉంచినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాంట్రాక్ట్/కంటెంట్ డీలే  సమస్యల కారణంగా.. దేశవ్యాప్తంగా  అన్నీ భాషల్లో సినిమాను విడుదల చేయలేకపోయాం. అది నాకెంతో బాధనిచ్చింది.  ఓవర్సీస్లోనూ 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి.

హిందీ కన్నడ తమిళం మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. తర్వాత రాబోయే 3 చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో  అనుకున్న సమయానికి రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి  నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. అదీ ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా. ఓ మంచి క్వాలిటీ సినిమాను మీకు అందిస్తాను"  అని అభిమానులకు నిఖిల్ సిద్దార్ధ  క్షమాపణలు తెలిపారు. 

 

Straight from the Heart ❤️?❤️‍?
A Promise from me to Every Cinema Loving Audience... #SpyMovie #Spy pic.twitter.com/SZfV9N4m4G

— Nikhil Siddhartha (@actor_Nikhil) July 5, 2023
 

 

నేతాజీ మిస్టరీ వెనుకాల దాగిన కోణాన్ని చూపించాలన్న కాన్సెప్ట్ తో వచ్చిన SPY మూవీ..కథనం సరిగ్గా ఆకట్టుకోక పోవడంతో బాక్సపీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. స్పై సినిమాకు ఎడిట‌ర్ గ్యారీ బీహెచ్(Garry Bh) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి(Rana Daggubati) అతిథి పాత్ర‌ను పోషించాడు.