ముగిసిన డబ్బింగ్..జులై 22న మూవీ రిలీజ్

V6 Velugu Posted on May 15, 2022

మూడేళ్ల క్రితం ‘అర్జున్ సురవరం’గా పలకరించిన నిఖిల్.. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. ఆ గ్యాప్‌‌ను పూరించడానికి ఈ యేడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు.  వాటిలో ముందు రిలీజయ్యే చిత్రం ‘కార్తికేయ2’. చందు మొండేటి దర్శకుడు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘కార్తికేయ’కి ఇది సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌‌ జరుగుతోంది. డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. నిన్నటితో నిఖిల్ తన పార్ట్‌‌ డబ్బింగ్‌‌ వర్క్‌‌ని కంప్లీట్ కూడా చేసేశాడు. రీసెంట్‌‌గా నిఖిల్ తండ్రి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి పనిలో జాయినయ్యాడు నిఖిల్. దాంతో ‘నిఖిల్ ఈజ్ బ్యాక్ టు వర్క్’ అంటూ సోషల్‌‌ మీడియాలో అప్‌‌డేట్ ఇచ్చిన మేకర్స్.. తను డబ్బింగ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా రివీల్ చేశారు. జులై 22న ఈ చిత్రం విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌‌.  బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్   కలిసి నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. సూర్య ప్రతాప్ డైరెక్షన్‌‌లో నిఖిల్ నటిస్తున్న ‘18 పేజెస్’  కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇక ‘స్పై’ అనే థ్రిల్లర్​లోనూ నటిస్తున్నాడు నిఖిల్. ఎడిటర్ గ్యారీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు.
 

Tagged spy, 18 pages, , Karthikeya 2, Hero Nikhil, chandu mondeti, dubbing work

Latest Videos

Subscribe Now

More News