
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ అయ్యారు. శంషాబాద్లోని నోవాటెల్లో ఈ భేటీ జరిగింది. వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఇది మర్యాదకపూర్వక భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం కూడా భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో నడ్డా భేటీ అయ్యారు.
తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇవాళ్టి పర్యటనలో నడ్డా కూడా నితిన్, మిథాలీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.