సామాజిక సేవలకు గానూ సోనూసూద్‌కు అవార్డు

సామాజిక సేవలకు గానూ సోనూసూద్‌కు అవార్డు

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. ఆయన చేస్తోన్న సామాజిక సేవలగానూ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో పెద్ద ఎత్తున డబ్బు, ప్రయాణం, ఆహారానికి అవసరమైన వారికి సహాయం చేసినందుకు నటుడు సోనూ సూద్ బుధవారం స్పెషల్ అచీవ్ మెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022' అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా సామాన్యుడికి సహాయం చేయడానికి కష్టపడుతున్న ఈ దేశంలోని ప్రతి పౌరుడికి తాను ఈ అవార్డును అంకితం చేస్తున్నానని సోనూసూద్ ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సోనూసూద్.. తాను నిజంగా దీనికి అర్హుడో కాదో తెలియదు... కానీ తమ ఇద్దరికీ నాగ్‌పూర్ అనుబంధం ఉన్నందున గడ్కరీ జీ (కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ) నుండి ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందని చెప్పారు. అవార్డు అందుకున్న సందర్భంగా, గత రెండున్నరేళ్లలో మిలియన్ల మంది తెలియని వ్యక్తులతో తాను కనెక్ట్ అయ్యానని.. అప్పుడే తనను తాను "కనుగొన్నానని" తెలిపారు. "రూ. 100, -రూ. 200 కోట్లతో తీసిన ఏ సినిమా కూడా తీసుకురాని సంతోషం, వారితో కనెక్ట్ అవ్వడం వల్ల, వారి ముఖాల్లో చిరునవ్వును చూసినప్పుడు వచ్చే ఆనందం చాలా ఎక్కువ అని సోనూసూద్ స్పష్టం చేశారు. తాను సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసినా నా జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నానన్న సోనూసూద్..  అత్యంత చెప్పుకోదగిన వ్యక్తి మాత్రం దర్శకుడేనన్నారు. ఈ సినిమా ఆగిపోకూడదని ప్రార్థిస్తున్నానని ఆయన తెలిపారు.